DilRaju : ఇకపై అంతా కొత్త వారితో ‘దిల్ రాజు డ్రీమ్స్’ సినిమాలు
- కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు దిల్ రాజు డ్రీమ్స్
- ఏడాదికి నాలుగైదు సినిమాల నిర్మాణం
- కొత్త కథలను వినేందుకు వారంలో ఒక రోజు కేటాయిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే..
Also Read : Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా టీంకు చేరుతుంది. త్వరలో ఈ కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేస్తాం. ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రెండు ప్రాజెక్టులను చేస్తున్నారు. ఈ సంస్థ కార్పోరేట్ స్టైల్లో ఉంటుంది. ఇందులో పని చేసే వారందరికీ జీతాలు ఇస్తాం.
Also Read : KrishJagarlamudi : సింపుల్ గా డైరెక్టర్ క్రిష్ వివాహం..
కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు తీస్తారో కూడా తెలియదు. అలంటి సినిమాల ద్వారా డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు డ్రీమ్స్‌ను స్థాపించాను. ఏడాదికి నాలుగైదు సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాం. కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలనే కండీషన్ పెట్టాను. బలగం వేణు మాకు సినిమా చేశాడు. మాతో ఎమోషన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఎల్లమ్మ సినిమాను కూడా మాకే చేస్తున్నారు. అలా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే నాక్కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి. 20 నిమిషాల స్క్రిప్ట్‌ను అందులో పెట్టాల్సి ఉంటుంది. అది మా టీం చూస్తుంది. ఆ తరువాత వడపోత కార్యక్రమం తరువాత నా వద్దకు వస్తుంది. ఈ కొత్త కథలను వినేందుకు వారంలో ఒక రోజు ఇకపై తప్పకుండా కేటాయిస్తాను.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!