బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను సిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని, దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
Read Also : తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి
జూన్ 6న కూడా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చేర్పించారు. సాధారణ పరీక్షల నిమిత్తం ఆయన నాన్-కోవిడ్ ఆసుపత్రి హిందూజాలో చేర్పించినట్టు ఆయన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించారు. అప్పుడు డాక్టర్ నితిన్ గోఖలే నేతృత్వంలోని ఆరోగ్య బృందం ఆయనకు వైద్య సేవలు అందించింది. వారు దిలీప్ కుమార్ కు బిలటేరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆయన ఊపిరితిత్తుల్లో సమస్యకు కారణమైన ఫ్లూయిడ్ ని తొలగించి జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ అంతలోనే ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు.