Dil Raju : నెగెటివ్ ట్రోలింగ్‌కు చెక్.. మంచు విష్ణు మార్గాన్ని ఫాలో అవుతున్న దిల్ రాజు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెగెటివ్ ట్రోలింగ్‌ని, ఫేక్ రివ్యూస్‌ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఎందుకంటే ‘కన్నప్ప’ మూవీ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు. ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే..
Also Read : Komali : నేను అది కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. ‘కన్నప్ప’ సినిమాని టార్గెట్‌గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్‌గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత టార్గెట్ చేసిన.. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరిస్తూ పబ్లిక్ కాషన్ నోటీస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. రిలీజ్ తర్వాత ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. ట్వీటర్లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్ పోస్ట్‌లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ విషయంలో దిల్ రాజు విష్ణు పద్దతికి ఫిదా అయ్యారు..
Also Read : Abhishek Bachchan : ఆమె మాటలే నాకు బలం..
ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్ ట్రోలింగ్‌పై స్పందించారు.. ‘ ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్‌కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేసింది.. దీంతో ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్‌ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్‌గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్‌గా రివ్యూస్ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్ మాత్రం చేయద్దు’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!