గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మేం అడగ్గానే ఈవెంట్‌కు రావటం ఆనందంగా అనిపించింది. నా లైఫ్‌లోనే అద్భుతమైన ఈవెంట్ అది. మెగాభిమానులు, జన సేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. నేను ఇంత ఎనర్జీ తెచ్చుకోవటానికి కారణం..పవన్ కళ్యాణ్ అని దిల్ రాజు అన్నారు. 12 ఏళ్ల క్రితం ఆయన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఇంత ఇమేజ్ పెట్టుకుని ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లటం అవసరమా! అని నాతో సహా చాలా మంది అనుకున్నారు. అయితే ఆయన పదేళ్ల జర్నీ చూస్తే మనలో తెలియని ఎనర్జీ వస్తుంది. రాజకీయాల్లోకి వెళ్లారు వర్కవుట్ కాలేదు. అలాగని వదిలి పెట్టలేదు. మళ్లీ ఇక్కడకు వచ్చి సినిమాలు చేశారు.
Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్?
ఇటీవల ఎన్నికల్లో ఆయన కూటమిలోని ఆయన పార్టీ 21కిగానూ 21 సీట్లు గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఆయనొక గేమ్ చేంజర్‌లా కనిపించాడు. ఆయన ప్రయాణం చూసి నేను ఫెయిల్ అవుతున్నానని చెప్పి ఆగిపోకూడదు.. ఏ హార్డ్ వర్క్ చేశామో అది మిస్ కాకూడదని, కళ్యాణ్‌గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి జర్నీ చేస్తున్నాను. ఏపీలో సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ ఫోస్, టికెట్ రేట్స్ పెంచటంపై క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్‌గారితో వకీల్ సాబ్ సినిమా చేయాలని ఆయన్ని కలిసి మాట్లాడాను. సినిమా అందరికీ రీచ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నామని చెప్పాం. ఆయన నా మాటలపై నమ్మకం ఉంచారు. తర్వాత ఫైనాన్సియల్ వ్యవహారాలను మాట్లాడుకున్నాం. సినిమా చేశాం. తర్వాత పవన్ చెప్పే వరకు ఆ సినిమా రెమ్యునరేషనే జనసేన పార్టీకి ఇంధనంగా ఉపయోగపడిందని నాకు తెలియదు. ఆయనకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత పెద్ద స్టేజ్‌పై చెప్పటంతో చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఓ డిప్యూటీ సీఎం, లీడర్‌గా ఉండి.. ఆయనలా పబ్లిక్‌గా చెప్పినప్పుడు పాదాభివందనం చేయాలనిపించింది అని దిల్ రాజు అన్నారు.