విజయవాడలో రామ్ చరణ్ తేజ రికార్డు బ్రేకింగ్ కటౌట్ లాంచ్ తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ ట్రైలర్ ట్రైలర్ అని అరుస్తుంటే సినిమా ట్రైలర్ నా ఫోన్లో ఉంది. మీ ముందుకు తీసుకు రావాలంటే ఇంకా కొంచెం వర్క్ చేయాల్సి ఉంది అనే ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. ట్రైలరే ఇప్పుడు సినిమా రేంజ్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ రేంజ్ లో మీకు ట్రైలర్ ఇవ్వడం కోసం రెడీ అయ్యాం. కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ న మీరు ట్రైలర్ చూస్తారని సందర్భంగా ఆయన అన్నారు. మెగాస్టార్ నుంచి ఈరోజు బాస్ వరకు మెగా బాస్ గా ఆయన ఒక్కరే ఉన్నారు అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు పేర్కొన్నారు.
Ram Charan Cut-Out Launch: రామ్ చరణ్ రికార్డు బ్రేకింగ్ కటౌట్ కి హెలికాప్టర్ పూలాభిషేకం
రామ్ చరణ్ గారి రికార్డు బ్రేకింగ్ కటౌట్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. గేమ్ చేంజెర్ సినిమా విషయానికి వస్తే నేను ఈరోజు విజయవాడ రావడానికి మరో కారణం కూడా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసేందుకు వచ్చాను. అమెరికాలో ఈవెంట్ జరిపాము గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈరోజు నిన్న మీరు టీవీలో చూసి ఉంటారు అక్కడ చూసిన వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేశారు.. డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను. కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ ను బట్టి ఎక్కడ చేసుకున్నా ఈ వెంట అనేది డిసైడ్ చేసుకుందాం.. కానీ ఆ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఈవెంట్ తో అన్నారు. ఈ క్రమంలో అభిమానులు అందరూ ఓజి, ఓజి అంటూ కామెంట్ చేస్తూ ఉండడంతో ఓకే గేమ్ చేంజర్ అయ్యాక ఓజి మీదకి షిఫ్ట్ అవుదామని అన్నారు.