బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ఇరుముడి’ చిత్రం మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసిందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఒకపక్క టాక్సిక్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన ఆయన ఇరుముడి సినిమాను తప్పించి కొన్ని చోట్ల టాక్సిక్ ప్రదర్శన ప్లాన్ చేశారు అని ఫీల్ అవుతున్న క్రమంలో దిల్ రాజు ఇరుముడి మీద ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, సాయికుమార్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కూర్మావతార్’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్ రాజు.. ‘ఇరుముడి’ సక్సెస్ టాలీవుడ్‌కు ఎంతటి ఎనర్జీని ఇచ్చిందో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘కూర్మావతార్’లో నటిస్తున్న సీనియర్ నటుడు సాయికుమార్ గురించి దిల్ రాజు ప్రత్యేకంగా మాట్లాడారు. “మొన్ననే ‘ఇరుముడి’లో గురుస్వామి పాత్రతో సాయికుమార్ గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఆ సినిమా ఇస్తున్న ఎనర్జీ కేవలం అందులో నటించిన వారికి మాత్రమే కాదు, ఈరోజు ఇండస్ట్రీ మొత్తం ‘ఇరుముడి’ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చి థియేటర్లను ఫుల్ చేస్తుంటే సినిమా తీసే నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. టాలీవుడ్ మొత్తానికి ఇరుముడి ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చింది” అని దిల్ రాజు సగర్వంగా చెప్పారు. ‘కూర్మావతార్’ కూడా అదే తరహాలో పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

