‘సీతారామం’ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ‘మృణాల్ పెళ్లి చేసుకుందా?’ అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కారణం.. ఆమె కాళ్లకు మెట్టెలు ధరించిన ఫోటో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఆ ఫోటోలో మృణాల్ ఠాకూర్ తన కాళ్ళకు మెట్టెలతో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి మృణాల్ కి పెళ్లి కాలేదు కదా.. ఈ మెట్టెలు ఎక్కడి నుండి వచ్చాయి. రహస్యంగా పెళ్లి చేసుకుందా అని చాలామంది ఈ ఫోటో కింద కామెంట్లు పెడుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..
Also Read : Betting Apps Case : రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు నమోదు..
మృణాల్ ఠాకూర్ కాళ్ళకు మెట్టెల తో షేర్ చేసిన ఆ పోస్ట్ డెకాయిట్ మూవీ యూనిట్ షేర్ చేశారు. అయితే ఈ హీరోయిన్ డెకాయిట్ చిత్ర షూటింగ్ లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చింది అనే అప్డేట్‌ని అభిమానులతో పంచుకోవడం కోసం ఈ పిక్ షేర్ చేశారు. అందమైన మృణాల్ ఠాకూర్ డెకాయిట్ మూవీ కోసం హైదరాబాద్ కి వచ్చింది మృణాల్ అడివి శేష్ అలాగే ప్రధాన తారాగణం తో ఉండే ఒక ముఖ్యమైన షెడ్యూల్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ హీరోయిన్ లు వెడ్డింగ్ విషయంలో సడెన్ షాక్ లు ఇస్తున్న క్రమంలో. మృణాల్ కూడా అలాంటి షాక్ ఇచ్చిందా అని.. ఆ ఫోటో చూసిన అభిమానులు ఒకింత షాక్ అయ్యారు.