Dhoom Dhaam: మా సినిమాలో కష్టాలు, కన్నీళ్లు ఉండవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించగా ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ సినిమా ఇంత బాగా రావడానికి మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ కారణం. ఆయన ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా ఫ్రెండ్ గోపీమోహన్ ఈ సినిమాకు నిత్యం వెన్నంటే ఉన్నారు. గోపీ సుందర్ మ్యూజిక్, రామజోగయ్య లిరిక్స్ మా మూవీకి ఆకర్షణగా నిలుస్తాయి. సెకండాఫ్ లోని కామెడీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారన్నారు.
హీరో చేతన్ మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫస్టాఫ్ పాటలు, లవ్ స్టోరీతో సరదాగా వెళ్తుంది. సెకండాఫ్ కు వచ్చేప్పటికి గంట సేపు పెళ్లి ఇంట్లో హిలేరియస్ కామెడీ ఉంటుంది. ఈ మూవీకి హీరోగా నా బెస్ట్ ఇవ్వాలి అని ప్రయత్నించా. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ కోసం స్టార్స్ కు పనిచేసిన స్టైలిస్ట్స్ వర్క్ చేశారు. నేను ఇంతకుముందు చేసిన గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి చిత్రాల్లో ఒక కమర్షియల్ లుక్ లో కనిపించలేదు. ఈ చిత్రానికి అలా కనిపించేందుకు ట్రై చేశా. మేము టీజర్ లో చూపించినట్లు “ధూం ధాం” సినిమాలో కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మీ సపోర్ట్ మా టీమ్ అందరికీ దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 8న థియేటర్స్ లో మా “ధూం ధాం” చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
Also Read
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!