Dhanush -Nag: మళ్లీ డాన్ అవుతున్న నాగ్.. ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధారావి అనగానే కచ్చితంగా అందరికీ ముంబై సిటీ గుర్తొస్తుంది. ఎందుకంటే అది ముంబై సిటీ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్లమ్ ఏరియాస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి అదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Also Read
ఇక ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది అని సినిమాలో నాగార్జున ఒక డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. గతంలోనే నాగార్జున డాన్ అనే సినిమా చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి డాన్ పాత్రలో ఆయన నటించబోతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తుండగా సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..