Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush Mythological Film: ధనుష్ హీరోగా సినిమా అంటేనే కథపై అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో, ‘సర్దార్’ ఫేమ్ పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో ఓ భారీ పౌరాణిక అడ్వెంచర్ తెరకెక్కబోతుందనే వార్తలతో ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథకు విజయేంద్ర ప్రసాద్ పేరు కూడా వినిపిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బజరంగీ భాయిజాన్’ వంటి సినిమాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ భారీ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ధనుష్‌తో కలిసి ఆయన పనిచేయబోతున్నారనే వార్త ఈ ప్రాజెక్ట్‌కు హైప్ తెస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
ఇక ఈ సినిమా పూర్తిగా కొత్త తరహా కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. దట్టమైన అడవి నేపథ్యంలో పౌరాణిక అంశాలను కలిపి భారీ స్థాయిలో కథను చెప్పేందుకు మిథ్రన్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాతో మిథ్రన్ హిందీ చిత్రసీమలో దర్శకుడిగా అడుగుపెట్టనున్నారు. ‘ఇరుంబు తిరై’, ‘హీరో’, ‘సర్దార్’ వంటి సినిమాలతో కంటెంట్ ఓరియెంటెడ్ యాక్షన్ కథలను తెరకెక్కించిన ఆయనకు ఇది పూర్తిగా భిన్నమైన ప్రయత్నం కానుంది.
మరోవైపు ఈ సినిమాలో ధనుష్ సరసన కరీనా కపూర్ నటించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల మిథ్రన్ స్వయంగా ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, డేట్స్ విషయంలో మాట్లాడుతున్నామని తెలిపారు. అంటే కరీనా కపూర్ కూడా ఇంకా ఆఫీషియల్ గా ఫైనల్ కాలేదన్నమాట. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే ధనుష్, కరీనా తొలిసారి కలిసి స్క్రీన్‌పై కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం డెవలప్మెంట్ దశలోనే ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు 2026 చివర్లో మొదలై, షూటింగ్ 2027 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ధనుష్ లాంటి పాన్ ఇండియా స్టార్, భన్సాలీ లాంటి విజువల్ గ్రాండియర్, మిథ్రన్ లాంటి కంటెంట్ డైరెక్టర్ కాంబినేషన్‌కే ఇప్పటికే భారీ హైప్ వస్తోంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా తోడైతే ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథలో ధనుష్‌ను మిథ్రన్ ఏ రూపంలో చూపించబోతున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!