Site icon NTV Telugu

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్ హీట్ పెంచిన దేవిశ్రీ

Devisri Prasad

Devisri Prasad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన ట్రేడ్‌మార్క్ మేనరిజమ్స్‌తో మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ని అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ ట్యూన్స్, పవన్ స్టైలిష్ లుక్స్ ఈ పాటకు చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2026లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read : Rukmini Vasanth : కాంతార బ్యూటీకి మరో తెలుగు ఛాన్స్..

ఇదిలా ఉండగా, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) స్వయంగా ఈ పాటకి స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. విదేశీ వీధుల్లో ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు తనదైన స్టైల్లో దేవి వేసిన స్టైలిష్ స్టెప్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేవి ఎనర్జీకి ఈ వీడియో ఒక నిదర్శనమని, కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా పాటను ఎలా ఎంజాయ్ చేయాలో కూడా ఆయన చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పీ, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Exit mobile version