కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న రెండవ సినిమా దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు రాబోతున్న దేవర మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది.
Also Read : Raghava Lawrence : రాఘవ లారెన్స్ 25వ సినిమాకు దర్శకుడిగా ‘వర్మ’..
కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ రోజుకొక రికార్డు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 1.25 మిలియన్ దాటి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. ఇక టికెట్స్ పరంగా 40,000పైగా టికెట్స్ బుక్ అయ్యాయని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే ఇటీవల ఆస్ట్రేలియా బుకింగ్స్ ఓపెన్ చేయగా అత్యంత వేగంగా $100k కలెక్ట్ చేసి రికార్డు సాధించాడు దేవర. ఓవర్సీస్ లో ఇంతటి భారీ బుకింగ్స్ కు కారణాలు ఏంటని ఆరాతీయగా ‘RRR’ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడం, 6 ఏళ్ల తర్వాత తారక్ సినిమా సోలో రిలీజ్ , పాటలు సుపర్ హిట్ అవ్వడంతో పాటు, కొరటాల ఎన్టీయార్ కాంబో క్రేజ్ అని గలగలిపి దేవర హ్యుజ్ బుకింగ్స్ లో కనిపించిందని ఓవర్సీస్ బయ్యర్స్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ షోస్ కు ఇప్పటి నుండే తాకిడి ఎక్కువగా ఉంది. సెప్టెంబరు 27న భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవరను నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలిని సంయుక్తంగా నిర్మించారు.