టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్ర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్ తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు.
Also Read : Devara : దేవర ప్రమోషన్స్ అంతా గప్ చుప్.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..
దేవర ముచ్చట్లు పంచుకుంటూ.. దర్శకుడు కొరటాల శివ, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ సందడి చేసిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ముఖ్యంగా ఈ ప్రోమోలో సందీప్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్న హైలెట్ గా నిలిచింది. దేవర రన్ టైమ్ ఎంతని సందీప్ రెడ్డి ప్రశ్నించగా చూడండి సందీప్ రన్ టైమ్ గురించి అడుగుతున్నాడు అని దర్శకుడు కొరటాల ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. వెంటనే తారక్ ఆనిమల్ రన్ టైమ్ ఎంత సార్ అని సందీప్ ప్రశించగా 3 : 20 గంటలు అని బదులిచ్చాడు సందీప్. అన్ని గంటల రన్ టైమ్ సినిమా తీసిన నువ్వు దేవర రన్ టైమ్ గురించి అడగడం ఆశ్చర్యంగా ఉందని ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్న ఈ ప్రోమో యెక్క ఫుల్ ఇంటర్వ్యూ సెప్టెంబరు 15న విడుదల చేయనున్నారు మేకర్స్.
Words as wild as the storm….
Here’s the promo! 💥#Devara #DevaraOnSep27th pic.twitter.com/YHPNyCokDq— Devara (@DevaraMovie) September 14, 2024