బిగ్ బాస్ బ్యూటీగా దీప్తి సునయన ఫేమస్ అయిన విషయం తెలిసిందే.. అంతకు ముందు డబ్ స్మాష్ యాప్ లతో ఓరేంజ్ సంపాదించుకుంది. బ్లూటీ సమంతకు డైలాగ్స్ చెబుతూ.. దీప్తి సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంది. కాగా.. దీప్తి సునయన ఎప్పుడైతే బిగ్ బాస్ రెండో సీజన్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతూ వచ్చింది. అంతేకాదు తనీష్‌తో నడిపించిన ట్రాక్, కౌశల్‌తో శత్రుత్వంతో బిగ్ బాస్ సీజన్‌లో బాగానే సందడి చేసింది ఈ అమ్మడు.. బిగ్ బాస్ షో తరువాత దీప్తి సునయన తన మీద వచ్చిన ట్రోలింగ్స్.. నెగెటివిటీని చూసి తెగ బాధపడింది. అయితే.. ఇంట్లోంచి బయటకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే.. రానురాను తన మీద జరిగే ట్రోలింగ్‌ను ఎంతో లైట్ తీసుకుంటుంది.
ఈనేపథ్యంలో.. షన్నుతో దీప్తి సునయన బ్రేకప్ చెప్పడంతో ప్రేమ వ్యవహారానికి స్వస్తి పలికే విషయంలోనూ ఎక్కువ మంది ఆమెను సపోర్ట్ చేశారు. అయితే.. దీప్తి తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు ఫన్నీ ప్రశ్నలు వేస్తే, మరికొందరు చిరాకు తెప్పించే ప్రశ్నలు వేశారు. అందులో ఓ నెటిజన్ మరీ హద్దులుదాటి.. నువ్ ఎప్పుడు రిప్ అవుతున్నావ్? అంటూ ప్రశ్న వేశాడు. దీంతో స్పందించిన దీప్తి సునయన ఎంతో కూల్‌గా నువ్ పోయాకే అంటూ.. అని సదరు నెటిజన్‌కు కౌంటర్ వేసింది సునయన. ఈ చిట్ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్ పై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మరిచి కొత్త జీవితంలో అడుగు వేస్తూ ముందుకు వెళుతున్న వారిని ఈ విధంగా ప్రశ్నలు వేస్తారా అంటూ మండి పడుతున్నారు. కానీ.. కూల్‌గా సమాధానం చెప్పిన దీప్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.