Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న పారితోషికాల వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎంత సక్సెస్ ఫుల్ గా ఉన్నా.. హీరోలతో సమానంగా ఆమెకు రెమ్యునరేషన్ దక్కకపోవడంపై ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తనకు ఇటీవల ఎదురైన ఒక సంఘటన గురించి వివరించారు. “ఒక సినిమాలో మేల్ స్టార్ కు (హీరోకు) ఒక ఫిక్స్డ్ రేట్ తో రెమ్యునరేషన్ లాక్ చేశారు. ఆ హీరోకి ఎంత ఇస్తున్నారో నాకు తెలిసింది. నా వర్క్ ఎక్స్ పీరియన్స్ పరంగా, నేను చేసిన సినిమాల సంఖ్య పరంగా చూసుకుంటే, ఆ హీరో కంటే నేనే ఎక్కువ సక్సెస్ ఫుల్ అని నాకనిపించింది. కాబట్టి నాకు కూడా అదే స్థాయి రెమ్యునరేషన్ కావాలని నేను డిమాండ్ చేశాను” అని దీపికా చెప్పారు.
దీపికా తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడినప్పుడు నిర్మాతల స్పందన వేరుగా ఉందని ఆమె తెలిపారు. “మా దగ్గర అంత బడ్జెట్ లేదు, సినిమాకి హీరో అవసరం, కాబట్టి మేం అతనికి అంత ఇస్తున్నాం.. నీకు ఇవ్వగలిగింది ఇంతే” అని వాళ్లు చెప్పడంతో.. “సరే, మీకో దండం.. నాకైతే ఇంట్రెస్ట్ లేదు” అని ఆ సినిమాను వదిలేసినట్లు ఆమె కుండబద్దలు కొట్టారు. ఆ సినిమా పేరేంటని ఇంటర్వ్యూయర్ అడిగినప్పటికీ, ఆమె నవ్వుతూ దాన్ని దాటేశారు. మహిళలు తమ పారితోషికం గురించి అడగడానికి ఎందుకు వెనుకాడుతున్నారనే ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు. “మన రెమ్యునరేషన్ కోసం పట్టుబడితే ఎక్కడ మంచి అవకాశాలు కోల్పోతామో అన్న భయం మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఆ భయం వల్లే చాలా మంది అడగలేకపోతున్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు వచ్చి దీని గురించి ప్రశ్నించాల్సిందే” అని దీపికా పదుకొనే స్పష్టం చేశారు. అయితే దీపిక పాన్ ఇండియా మూవీ స్పిరిట్ నుంచి తప్పుకున్నారని, లేదు తప్పించారని రకరకాల వాదనలు ఉన్నాయి. మరి ఆమె దాని గురించే మాట్లాడారా? లేక మరేదైనా సినిమానా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!