ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ దీపికా పదుకోణే . ‘కల్కి 2’ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారన్న వార్తలు విశేష చర్చలకు కారణమయ్యాయి. అయితే ఈ హీట్ మూమెంట్లో.. దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో తన అనుభవాలను, తన నిర్ణయాల వెనుక ఉన్న అసలు విషయాలు పంచుకున్నారు.
Also Read : Itlu Mee Edava : యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
ప్రజంట్ దీపికా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ తో ‘కింగ్’లో నటిస్తోంది. ఈ సందర్భంగా, 18 ఏళ్ళ క్రితం షారుక్ ఆమెకు ఇచ్చిన పాఠాన్ని గుర్తుచేశారు. దీపికా ‘18 ఏళ్ళ క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమాను చేస్తున్నప్పుడు, షారుక్ కొన్ని పాఠాలు నేర్పారు. సినిమా విజయం, మనం ఎవరితో సినిమా చేస్తున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అని ఆ మాటను నేను పూర్తిగా నమ్ముతాను. అప్పటి నుంచి నా ప్రతీ నిర్ణయం ఆ పాఠానికి అనుగుణంగా తీసుకుంటున్నాను’ అని తెలిపింది. దీపికా ఈ మాటల ద్వారా, తన కొత్త ప్రాజెక్ట్‌పై తీసుకున్న నిర్ణయాలను, తన వ్యక్తిగత అభిరుచులు మరియు వ్యాపార నిర్ణయాలపై దృష్టి పెట్టిన విధానాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపికా–షారుక్ కాంబో చాలా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు మరియు నెటిజన్లు దీపికా వ్యాఖ్యలను ‘కల్కి 2’ గురించి పరోక్షంగా మాట్లాడడం’ గా భావిస్తూ వివిధ రకాల కామెంట్లను ఇస్తున్నారు.
ఇకపుడు ‘కల్కి 2898 ఏడి’ సీక్వెల్లో దీపికా నటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పరోక్షంగా స్పందించి.. ‘జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’ అని. ఇక ఈ గోడవ ఏ మంటూ స్టార్ట్ అయిందో AI ద్యారా రష్మిక, ఆలియా,సమంత, వంటి స్టార్ హీరోయిన్ ల ఫేస్.. దీపిక కల్కి లుక్ లోకి మార్ఫ్ చేసి పోస్ట్ లు పెడుతున్నారు.