లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాదిలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. తమిళం-తెలుగు-మలయాళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘జవాన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. అయితే తాజాగా నయనతార గతంలో తన కెరీర్‌లో చేసిన ఓ తప్పును గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Rashmika : ఇండస్ట్రీలో కెరీర్‌ను నిలబెట్టుకోవడమే అసలైన యుద్ధం..
తమిళంలో సూర్య హీరోగా నటించిన గజిని సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆసిన్ ప్రధాన కథానాయికగా నటించిన ఈ సినిమాలో నయనతార సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆమె ఒక మెడికల్ స్టూడెంట్ గా కనిపించింది. అయితే ఈ పాత్రను తాను ఆశించిన విధంగా చూపలేదని, తన లుక్స్‌ను కూడా అతి తక్కువ స్థాయిలో చూపారని ఆమె పేర్కొంది. ‘ఆ సినిమాలో నన్ను అసహ్యంగా చూపించారు. ఫొటోలు కూడా చెత్తగా తీశారు. నాకు ముందుగా చెప్పారు అంతకంటే పాత్రను తక్కువగా చూపించారు. అది నా కెరీర్‌లో తప్పు నిర్ణయం. ఇప్పుడు అది ఒక పాఠం అయింది’ అని తెలిపింది నయనతార.
ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన వీడియో నయన్ లుక్‌తో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. అలాగే తమిళంలో మరిన్ని మహిళా ప్రాధాన్య సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.