KJQ: దసరా డైరెక్టర్ తమ్ముడు హీరోగా KJQ.. టీజర్ అదిరిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరాలో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోలుగా యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’. నాగార్జున కేడీ డైరెక్టర్ కె.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 1990ల నేపథ్యంలో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తొలి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు ఆసక్తికరంగా సాగుతుంది.
Read More: Anantapur Crime: కొత్తరకం మోసం.. కారులో సీఐ సార్ ఉన్నారంటూ..!
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దీక్షిత్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌లో “ఈ సిటీ, ఈ గన్… రెండూ ఒక్కటే. ఎవరి చేతిలో ఉంటాయో, వాళ్ల మాటే వింటాయి” అనే డైలాగ్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఈ ఒక్క డైలాగ్ సినిమా టోన్‌ని సెట్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. టీజర్‌లో హీరోయిన్ చెప్పిన “మగాడు గెలుస్తాడు, కానోడు లాగేస్తాడు… నీవు ఏమిటో నీవే నిర్ణయించుకో” అనే డైలాగ్ సినిమాలోని ఎమోషనల్ లైన్ ను టచ్ చేస్తోంది. అలాగే, టీజర్ చివర్లో “రావణాసురుడు నా లెక్క ఆలోచించకపోతే, రామాయణం ఉండేది కాదు” అనే డైలాగ్ సినిమా కథలోని కీలక ఎమోషన్ ను హైలైట్ చేస్తూ, ప్రేక్షకుల్లో సినిమాను చూడాలనే ఆసక్తిని మరింత పెంచుతుంది.
Read More: Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు, నాగేష్ బనెల్ సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్, శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి. మొత్తంగా, ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’ టీజర్ సినిమాపై భారీ అంచనాలను కలిగిస్తూ, థియేటర్‌లో ఒక గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాను ఆస్వాదించాలనే ఉత్సాహాన్ని ప్రేక్షకుల్లో నింపుతోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..