తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.
డియర్ ఉమ ట్రైలర్‌ను గమనిస్తే.. సింగర్ అవ్వాలని ప్రయత్నించే హీరో.. డాక్టర్ అవ్వాలని హీరోయిన్.. రెండు వేర్వేరు లక్ష్యాలతో ఉన్న ఆ ఇద్దరూ కలవడం, ఆ తరువాత ప్రమాదం జరగడం, వైద్య రంగంలోని లోపాల్ని చూపుతూ సాగిన సీన్లు ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, హీరో యాక్షన్ సీక్వెన్స్‌లు, చివర్లో కార్పోరేట్ కబంద హస్తాల్లోంచి వైద్యరంగాన్ని బయటకు తీసుకురండి అంటూ హీరో చెప్పిన డైలాగ్‌ను చూస్తే మంచి సందేశాన్ని ఇవ్వబోతోన్నట్టుగా అర్థమవుతోంది.
Okkadu : ’ఒక్కడు’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది..
ట్రైలర్ లాంచ్ అనంతరం సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘ఓ మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాలని అనుకున్నాను. కథ రాస్తూ ఉండగా ఎంతో కంటెంట్ వచ్చేది. రాజేష్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఆయన తన కథలన్నీ పక్కన పెట్టి నా కథ మీద దృష్టి పెట్టారు. అయితే నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారా అని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ నన్ను సపోర్ట్ చేశారు. నాకు సంగీతం చాలా ఇష్టం. రధన్ గారు చేసిన అందాల రాక్షసి పాటలు చాలా ఇష్టం. అసలు రధన్ గారు మా సినిమాని ఒప్పుకుంటారా? లేదా? అని అనుకున్నాను. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అన్నారు. నన్ను నమ్మి హీరోగా చేసిన పృథ్వీ గారికి థాంక్స్. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజయం వెనుక నా టీం ఉంది. ఏప్రిల్ 18న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.