రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ గగ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన రాజాసాబ్ ట్రైలర్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరించింది.
Also Read : TheRajaSaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెప్పిన విశ్వప్రసాద్
కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను నవంబరు 5న రిలీజ్ చేస్తామని నిర్మాత విశ్వప్రసాద్ మీడియా సమక్షంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మరొక క్రేజీ అప్డేట్ తెలిసింది. రాజాసాబ్ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట. అందుకు సంబంధించి కథా చర్చలు కూడా ముగిసాయట. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసి పాయింట్ కూడా చెప్పాడట దర్శకుడు మారుతి. పాయింట్ కూడా నచ్చడంతో ఒకే చెప్పేశాడట డార్లింగ్. జవవరి 9న రాబోతున్న రాజసాబ్ సినిమా చివర్లో కూడా సెకండ్ పార్ట్ కు సంబంధించి ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. ప్రభాస్ నెక్ట్స్ సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ లో నటిస్తున్నాడు. ఫౌజీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కల్కి 2, సలార్ 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. మరి ఇన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో రాజాసాబ్ 2 ఎప్పుడు చేస్తారో ఎప్పుడు రిలీజ్ అవుతుందో డార్లింగ్ కు కూడా తెలియదు.