రెండు రోజుల నుండి టాలీవుడ్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదే రెబెల్ స్టార్ ప్రభాస్, డాన్స్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ కాంబోలో సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ ఒక డాన్స్ మాస్టర్ కు సినిమా ఛాన్స్ అవకాశం ఎలా ఇచ్చాడని ఒకటే డిస్కషన్. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయింది.
Also Read : Star Hero’s : ఒకరికి వరుస హిట్స్.. మరొకరికి వరుస ప్లాప్స్.. ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు
నృత్య దర్శకుదిగా ఎన్నో సంచలనాలు సృస్టించిన ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. తొలి ప్రయత్నంలో భాగంగా ఓ యానిమేషన్ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు కథ కూడా వినిపించారు. ప్రేమ్ రక్షిత్ చెప్పిన కథకు రెబల్ స్టార్ ఇంప్రెస్ అయ్యాడు. దాంతో వెంటెనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. అయితే ఇందులో ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అలాగే ప్రభాస్ డైరెక్ట్ గా ఈ సినిమాలో చేయడం లేదు. కేవలం యానిమేషన్ రూపంలో మాత్రమే డార్లింగ్ ఈ సినిమాలో దర్శనమివ్వబోతున్నాడు. ఆ యానిమేషన్ పాత్రకు రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ మాత్రమే అందిస్తారు. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవలేదు. కొన్ని మార్పులు చేర్పులు సూచించడంతో రీవర్క్ చేస్తున్నాడు ప్రేమ్ రక్షిత్. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లందుకు మరికొంత సమయం పడుతుందట. అన్ని కుదిరితే ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశం ఉంది. అన్నట్టు ప్రభాస్, రాజమౌళి కంబోలో వచ్చిన బాహుబలిలోని మూడు బాణాలు యాక్షన్ సీక్వెన్స్ ను ప్రేమ్ రక్షిత్. కొరియోగ్రఫీ చేసాడు.