రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా, మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్స్ కి అనుకున్న విజయాన్ని ఇవ్వలేదు,. అనేక సినిమాలమధ్య పోటీగా రావడంతో ఓ మోస్తరుగా ఆడింది. ఇక ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.
Also Read : Venkatesh : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెంకీ బిజీ.. దృశ్యం 3 ఇక దాదాపు లేనట్టే.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ‘దండోరా’ టీమ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ప్రశంసలతో యూనిట్ ఉబ్బితబ్బిబవుతోంది. ఎన్టీఆర్ ట్వీట్ కు దర్శకుడు మురళి కాంత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ ఎన్టీఆర్ అన్న మీరు నా సినిమా చూసారు, నా పేరు పలికారు ఇది చాలు అన్న, షివరింగ్ అవుతున్న అన్న’ అని ఎమోషన్ అయ్యాడు. అటు నిర్మాత బెనర్జీ ‘ అన్న ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్న. ఇది మాకు అసలైన విజయం అన్న’ అని భావోద్వేగం అయ్యారు. మరోవైపు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి దండోరా వంటి చిన్న సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఎన్టీఆర్ ట్వీట్ ప్రభావంతో ‘దండోరా’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతూ విశేషమైన స్పందనను అందుకుంటోంది. బలమైన కథాంశం, నటీనటుల నటనతో పాటు ఎన్టీఆర్ లాంటి స్టార్ ప్రశంసలు ‘దండోరా’ సినిమాకు కొత్త ఊపునిచ్చాయని చెప్పవచ్చు.