Dance master Yashwant as hero: ఢీ డాన్స్ షో ఆల్ ఫార్మేట్స్ లో విన్నర్ అయిన యశ్వంత్ కుమార్ అలియాస్ డాన్స్ మాస్టర్ యశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ‘యు టర్న్’ సినిమాలో కర్మ థీమ్ సాంగ్ తో పాటు ‘ప్రతి రోజు పండగ’ సినిమాలో ‘ఓ బావ..’, ‘చిత్రలహరి’లో ‘గ్లాస్ మేట్స్’, ‘జార్జిరెడ్డి’ సినిమాలో ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డ్’ పాటలతో పాటు ‘సోలో బ్రతుకే సో బెటర్’లో ‘నో పెళ్ళి’, ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’లో ‘నీలి నీలి ఆకాశం’ పాటలకు కొరియోగ్రఫీ సమకూర్చి ఆ పాటల విజయంలో కీలక పాత్ర పోషించాడు డాన్స్ మాస్టర్ యశ్.
Read also: Hit -2: అనుకున్నంతా అయ్యింది… ఆ సినిమా పెద్దలకు మాత్రమే!
ఇక ఇప్పుడు యశ్ ను హీరోగా పరిచయం చేస్తున్నది ఎవరో కాదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శశికుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ యశ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి ‘ఆకాశం దాటి వస్తావా’ అనే టైటిల్ ను పెట్టినట్లు సమాచారం. శశికుమారు ఇటీవల విడుదలైన ‘లవ్ టుడే’ సినిమాకు తొలి సారి సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమాకు డైలాగ్స్ పెద్ద ఎస్సెట్ గా నిలవటం విశేషం. ‘ఆకాశం దాటి వస్తావా’లో హీరోయిన్ గా కార్తిక నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి.జె. మురళీధరన్ కుమార్తెనే ఈ కార్తిక. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో 10 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్ తదితర వర్క్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయటానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. మరి హీరోగా యశ్వంత్, హీరోయిన్ గా కార్తిక, దర్శకుడుగా శశికి ‘ఆకాశం దాటి వస్తావా’ ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందో చూద్దాం.
Viral Video: ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్.. శిక్ష ఏంటంటే