గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. అసలు బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్ బాక్సులు బద్దలు చేయడం గ్యారెంటీ అని నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
Also Read : KA10 : ‘దిల్ రూబా’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం
ఇక ఫైనల్ గా 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న డాకు మహారాజ్ థియేట్రీకల్ బిజినెస్ ఊహించినట్టుగానే భారీగా జరుగుతోంది. ఆంధ్ర మొత్తంగా డాకు మహారాజ్ ను రూ. 40 కోట్ల రేషియోలో బిజినెస్ చేస్తున్నారు మేకర్స్. ఇక నందమూరి అడ్డాగా పిలవబడే సీడెడ్ ( రాయలసీమ) ఏరియా బిజినెస్ కూడా భారీగా జరిగిందట. ఇక నైజంలో ఈ సినిమా రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసారు. ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమను రిలీజ్ చేస్తున్నారు. బలయ్యా, బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. బాలయ్య గత సినిమాల హయ్యెస్ట్ కలెక్షన్స్ ను డాకు మహారాజ్ దాటేస్తుందని లెక్కలు వేస్తున్నారు. జనవరి 12న రిలీజ్ కు రెడీ గా ఉన్న డాకు మహారాజ్ ఎంతటి సంచలనం చేస్తాడో చూడాలి.