NTV Telugu Site icon

Devara Daavudi Song: బాధను భరిస్తూ అలా చేయడం గ్రేట్.. తారక్ పై రత్నవేలు ట్వీట్ వైరల్‌

Ratnavelu

Ratnavelu

Daavudi Song: దేవర లోని మూడో పాట విడుదలైన ‘దావూదీ.. దావూదీ’ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 4) దేవరలోని మూడో సింగిల్‌గా దావూదీ పాట విడుదలైంది. ఇది యూట్యూబ్‌లో విడుదలైందో లేదో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అభిమానులను ఆటకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేస్తున్నాయి. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ఈ పాటపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అంత బాధలో కూడా ఎలా స్టెప్పులు వేస్తున్నారు అంటూ ట్విటర్ వేదిగా తెలిపారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏం బాధలో వున్నారు? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దావూదీ సాంగ్ షూటింగ్ చేసేప్పుడు ఎన్టీఆర్ కండరాల నొప్పి, గాయంతో బాధపడుతున్నారట. అయినా సాంగ్ సూటింగ్ కు పిలవడంతో అవేమి పట్టించుకోకుండా.. దావూదీ సాంగ్ చేశాడట ఎన్టీఆర్. అంత బాధలో కూడా తన అభిమానుల కోసం ఎంత నొప్పినైనా భరిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం అంటూ.. దావూదీ లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్ కు తారక్ ఇంత ఈజీగా స్టైలిష్ స్టెప్పులు వేశాడంటే ఆశ్చర్యంగా ఉందని రత్నవేలు తెలిపారు.

Read also: Delhi : లోపల వైఫై, జీపీఎస్, సీసీటీవీ..ఢిల్లీలోని సామాన్య ప్రజల కోసం స్పెషల్ బస్సు సర్వీసు

అయితే ఈ ట్విట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు అన్నా నువ్వు గ్రేట్ అన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. అన్నతో అట్లుంటది మరి అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు.. ఎంత బాధనైనా భరిస్తాడంటూ కమెంట్ చేస్తున్నారు. నిజానికి దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడని తెలిసినప్పటి నుంచి సినిమా రేంజ్ మారిపోయింది. దానికి కారణం..అనిరుధ్ నుంచి గత సినిమాల్లో తన సంగీతంతో విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అందుకే దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా దేవర పాటలతో కూడా అదే అంచనాలు నిజమవుతున్నాయి. దేవర సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాలోని మూడు పాటలు ఐదు భాషల్లో విడుదలయ్యాయి. మొదటి రెండు పాటలు అన్ని భాషల్లో పాపులర్ అయ్యాయి. ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు.
Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!