మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం బడ్జెట్ భారీగా పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఖిలాడీ’ కోసం 25 రోజుల ఇటలీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో మూవీ టీం ముందుగా ప్లాన్ చేసుకున్న షూటింగ్ లో 50 శాతం మాత్రమే పూర్తి చేసింది. అది కూడా అంత సంతృప్తికరంగా రాలేదట. దీంతో ఇప్పుడు ‘ఖిలాడీ’ బడ్జెట్ భారీగా పెరిగిపోయిందట. ఇటలీ షెడ్యూల్ కోసం మేకర్స్ రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే ఆ షెడ్యూల్ లో మేకర్స్ కోరుకున్న అవుట్ ఫుట్ రాకపోవడంతో ఆ సన్నివేశాలను మళ్ళీ హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ను రూపొందించడానికి నిర్మాతలు సుమారు రూ .25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 15 కోట్లలో అయిపోవాల్సిన షెడ్యూల్ కు 25 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట. ‘ఖిలాడి’ బృందం మే 10 నుండి సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తుంది. మిగిలిన షూటింగ్ భాగాన్ని వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘ఖిలాడి’ బడ్జెట్ ఇలా భారీగా పెరిగిపోయిందన్నమాట.