Site icon NTV Telugu

Coolie : అమీర్ ఖాన్ తో కాంబినేషన్ సీన్స్.. నాగ్ లీక్స్!

Nagarjuna Jarinikanth

Nagarjuna Jarinikanth

తమిళ సినిమా దిగ్గజం సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా గురించి రోజురోజుకూ కొత్త వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు నిజమా, పుకారా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాగార్జున ‘కూలీ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Also Read:Love Couples: అనుమానస్పద స్థితిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన విలన్‌గా కనిపించనున్నారని, రజనీకాంత్‌తో ఆయన సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని, ఆయన పాత్ర అభిమానులను ఆశ్చర్యపరుస్తుందని నాగార్జున వెల్లడించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, నాగార్జున, అమీర్ ఖాన్ కలిసి నటించే సన్నివేశాలు లేవని, కానీ ఆమిర్ ఖాన్ పాత్ర సినిమాకు ఊహించని ట్విస్ట్‌ను తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

Also Read:Kingdom : వాయిదాలకు గుడ్‌బై.. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ వ్యాఖ్యలు నాగార్జున నోటి నుంచి వచ్చాయా లేక కేవలం పుకార్లా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ‘కూలీ’ సినిమా రజనీకాంత్, నాగార్జున మధ్య జరిగే ఘర్షణగా ఉంటుందని, ఇందులో ఆమిర్ ఖాన్ క్లైమాక్స్ సన్నివేశాల్లో కనిపించి అభిమానులను షాక్‌కు గురిచేస్తారని మరో వార్త వినిపిస్తోంది. అయితే : రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్.. ఈ ముగ్గురి కాంబినేషన్ సినిమాకు ఎలాంటి సంచలనం తీసుకొస్తుందో అని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. కానీ, ఈ వార్తల్లో నిజం ఏంటో తెలియాలంటే, సినిమా విడుదలయ్యే వరకు ఆగస్టు 14 వరకు అభిమానులు ఆగాల్సిందే!

Exit mobile version