లోకేష్ కనకరాజ్ రీసెంట్ సినిమా కూలీలో అమీర్ ఖాన్ ప్రత్యక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ హీరోగా ఈ తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖైదీ 2 తర్వాత ఆమిర్ ఖాన్ – లోకేష్ సినిమా ఉంటుందని కూడా వినిపించింది.
Also Read : Akhanda2 : అఖండ 2.. రికార్డ్ బ్రేకింగ్ ఓటీటీ డీల్.. టాలీవుడ్ లో నలుగురు మాత్రమే
అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా దాదాపు లేనట్టే అని టాక్ వినిపిస్తోంది. అందుకు కూలీ సినిమా ఒక కారణం అనే చెన్నై వర్గాలలో వినిపించే టాక్. కూలీలో అమీర్ ఖాన్ రోల్ పట్ల భారీ నెగిటివిటి వచ్చింది. అసలు ఆ పాత్ర ఆమిర్ ఖాన్ చేసి ఉండాల్సింది కాదని అటు క్రిటిక్స్ తో పాటు ఆడియెన్స్ కూడా అదే భావం వ్యక్తం చేసారు. కానీ విక్రమ్ లో రోలెక్స్ పాత్రలో సూర్య కు వచ్చిన ఇమేజ్ తనకు వస్తుందని భావించిన అమిర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపధ్యంలో లోకేష్ కనకరాజ్ కూడా తన ప్లాన్స్ ను చేంజ్ చేసాడు. ఖైదీ 2 ను కూడా పక్కన పెట్టి రజనీకాంత్ మరియు కమల్ హాసన్‌లతో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కార్తీతో మోస్ట్ అవైటెడ్ కైథీ 2 చేయబోతున్నాడు. కాబట్టి, రాబోయే 4 సంవత్సరాలు లోకేష్ ఈ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంటాడు. సో ఇక అమిర్ తో సినిమా లేనట్టే.