Site icon NTV Telugu

Kollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో

Vikram

Vikram

చియాన్ విక్రమ్ సినిమాలొస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ ఆపాన్ ఎ టైమ్. కానీ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి రా అన్నట్లుగా తయారయ్యింది సిచ్యుయేషన్. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు పరిస్థితికి తగ్గట్లుగా కథల ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తాయోమో కానీ కాసులు కురిపించవు అని ఫ్రూవ్ అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫలితం డిజాస్టర్లతో మార్కెట్ కోల్పోతున్నాడు.

Also Read : Flop Star : ప్లాప్ స్టార్ కు కథ చెప్పిన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్?

తంగలాన్ కోసం బాగా కష్టపడ్డాడు విక్రమ్. కానీ బొమ్మ డిజాస్టర్. వీర ధీర శూరన్ ఓకే అనిపించుకున్నప్పటికీ  రూ. 70 కోట్లు దాటలేకపోయింది. పొన్నియన్ సెల్వం హిట్టైనా అది గుంపులో గోవిందం క్యారెక్టర్. ఇక ఎప్పుడో కంప్లీట్ చేసిన ధ్రువ నక్షత్రం సంగతి సరేసరి. ఇప్పుడు ఆయన చేతిలో టూ ఫిల్మ్స్ ఉన్నాయన్న మాటే కానీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తంగలాన్ కన్నా ముందే విక్రమ్ 63ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. మండేలా డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకుడు. కానీ ప్రాజెక్టు నుండి డైరెక్టర్ తప్పుకున్నాడు. అలాగే 96 ఫేం ప్రేమ్ కుమార్ విక్రమ్ 64ని డీల్ చేయనున్నాడని తెలుస్తోంది.  చియాన్ చేతిలో సినిమాలున్నా ముందడుగు పడటం లేదు. విక్రమ్ 63 నుండి డైరెక్టర్ వెళ్లిపోవడంతో ప్రొడక్షన్ హౌస్ శాంతి టాకీస్ డైలామాలో పడిపోయిందట. తంగలాన్ కన్నా ముందే చియాన్ సైన్ చేశాడట. అయితే ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేశాడట చియాన్. కానీ ప్రజెంట్ విక్రమ్‌కు మార్కెట్ లేకపోవడంతో పాటు ఆయన నటించిన సినిమాలు ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ సరైన అమౌంట్ రాకపోవడంతో విక్రమ్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరిందట నిర్మాణ సంస్థ. తన సిచ్యుయేషన్ తెలిసి విక్రమ్ కూడా రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గాడన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగానే నడుస్తుంది.

Exit mobile version