Kollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చియాన్ విక్రమ్ సినిమాలొస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ ఆపాన్ ఎ టైమ్. కానీ ఇప్పుడు ఎందుకొస్తున్నాయి రా అన్నట్లుగా తయారయ్యింది సిచ్యుయేషన్. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు పరిస్థితికి తగ్గట్లుగా కథల ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తాయోమో కానీ కాసులు కురిపించవు అని ఫ్రూవ్ అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫలితం డిజాస్టర్లతో మార్కెట్ కోల్పోతున్నాడు.
Also Read : Flop Star : ప్లాప్ స్టార్ కు కథ చెప్పిన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్?
Also Read
తంగలాన్ కోసం బాగా కష్టపడ్డాడు విక్రమ్. కానీ బొమ్మ డిజాస్టర్. వీర ధీర శూరన్ ఓకే అనిపించుకున్నప్పటికీ రూ. 70 కోట్లు దాటలేకపోయింది. పొన్నియన్ సెల్వం హిట్టైనా అది గుంపులో గోవిందం క్యారెక్టర్. ఇక ఎప్పుడో కంప్లీట్ చేసిన ధ్రువ నక్షత్రం సంగతి సరేసరి. ఇప్పుడు ఆయన చేతిలో టూ ఫిల్మ్స్ ఉన్నాయన్న మాటే కానీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తంగలాన్ కన్నా ముందే విక్రమ్ 63ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. మండేలా డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకుడు. కానీ ప్రాజెక్టు నుండి డైరెక్టర్ తప్పుకున్నాడు. అలాగే 96 ఫేం ప్రేమ్ కుమార్ విక్రమ్ 64ని డీల్ చేయనున్నాడని తెలుస్తోంది. చియాన్ చేతిలో సినిమాలున్నా ముందడుగు పడటం లేదు. విక్రమ్ 63 నుండి డైరెక్టర్ వెళ్లిపోవడంతో ప్రొడక్షన్ హౌస్ శాంతి టాకీస్ డైలామాలో పడిపోయిందట. తంగలాన్ కన్నా ముందే చియాన్ సైన్ చేశాడట. అయితే ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేశాడట చియాన్. కానీ ప్రజెంట్ విక్రమ్‌కు మార్కెట్ లేకపోవడంతో పాటు ఆయన నటించిన సినిమాలు ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ సరైన అమౌంట్ రాకపోవడంతో విక్రమ్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరిందట నిర్మాణ సంస్థ. తన సిచ్యుయేషన్ తెలిసి విక్రమ్ కూడా రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గాడన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగానే నడుస్తుంది.
తాజావార్తలు
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!