నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది నూతన హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలల్లో ఇంత పెద్ద హిట్ అయిన సినిమా లేదు.
Also Read:Tollywood: గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు.. ఛైర్మెన్ ఎవరంటే.?
ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించటం విశేషం. కాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్చేశారు మేకర్స్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా కమిటీ కురూళ్లు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది. కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్ కు ముందు ఈ చిత్ర రైట్స్ ను సేల్ చేయలేదు నిర్మాతలు. థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ కావడంతో భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అటు థియేట్రీకల్ రైట్స్ కొనుగోలు చేసిన వంశీ నందిపాటికి, ఎగ్జిబిటర్లకు లాభాలు తెచ్చిపెట్టిన కమిటీ కుర్రోళ్ళు డిజిటల్ రూపంలో నిర్మాతకు మరిన్ని లాభాలు తెచ్చిపెట్టారు. త్వరలోనే ఈ చిత్రం ఆహా లో స్ట్రీమింగ్ కు రానుంది.