Kishkindhapuri : “కిష్కింధపురి” పై చిరంజీవి రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో తాజాగా విడుదలైన ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటి ‘కిష్కింధపురి’. ప్రతిభావంతుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి తెరకెక్కించారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, థియేటర్లలో సాలిడ్ రన్‌ను కొనసాగిస్తోంది. కాగా ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాలను పంచుకోవడం వైరల్‌గా మారింది.
Also Read : OG : ఓజి ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టిన ప్రియాంక మోహన్
Also Read
ఒక వీడియో ద్వారా ఆయన రివ్యూ ఇచ్చారు.. “కిష్కింధపురి సినిమా నిజంగా నాకు నచ్చింది. ఇది సాధారణ హారర్ మూవీకాకుండా, డైరెక్టర్ కౌశిక్ పగళ్ళపాటి ఒక సైకలాజికల్ యాంగిల్‌ని బాగా చూపించారు. ఆ పాయింట్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అలాగే చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాలోకి మంచి ఎనర్జీని తెచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఈ ఇద్దరి నటనతో పాటు, టెక్నికల్ వర్క్ కూడా సినిమా స్థాయిని ఎత్తుకు తీసుకెళ్లింది. నా నెక్స్ట్ సినిమా ‘శివ శంకర వరప్రసాద్ గారు’కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సాహు గారపాటి గారు ఈ చిత్రానికి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ప్రయత్నం చాలా బాగుంది. ఈ సినిమాను తప్పక థియేటర్లలో చూసి ప్రోత్సహించాలి. ఇది కొత్తగా, వేరే రకం అనుభూతిని ఇస్తుంది” అని అని మెచ్చుకున్నారు చిరంజీవి. ఇలాగే పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో, ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కిష్కింధపురి’ కి ఇప్పటికే మంచి టాక్ రావడంతో పాటు, మెగాస్టార్ రివ్యూ కూడా కలిసి వచ్చినందున, రాబోయే రోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
#Kishkindhapuri is now certified by the BOSS ✅
Megastar @KChiruTweets Garu appreciated the team for coming up with a horror film laced with thilling elements ❤🔥❤🔥
Watch the THRILLING #Blockbusterkishkindhapuri at your nearest cinemas☠️
🎟️ Book your tickets for… pic.twitter.com/NvKtUUZqkz
— Shine Screens (@Shine_Screens) September 16, 2025
తాజావార్తలు
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
-
Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
-
Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
-
El Nino: భారత్‌కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
-
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..