Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్, డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ వంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖను చిరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందించగా.. తాజాగా అమిత్ షాకు చేరింది. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కళాకారుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చట్టపరమైన రక్షణలపై చిరు తన లేఖలో పలు సూచనలు చేశారు. ఈ నెల 2న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ సమావేశమైన విషయం తెలిసిందే.
ఏఐ దుర్వినియోగం కారణంగా సినీ కళాకారులు, ఫిల్మ్, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోతున్నారని చిరంజీవి పేర్కొన్నారు. కళాకారులు దశాబ్దాల పాటు కష్టపడి గుర్తింపు, పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తుంటారని.. అయితే ప్రస్తుతం వారి ముఖాలు, గొంతులు, సృజనాత్మక పనులను అనుమతి లేకుండానే డిజిటల్ రూపంలో పునఃసృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కళాకారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కుంగిపోతున్నారని తెలిపారు. చేయని తప్పులకు కూడా సమాజంలో తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఏఐ సాయంతో వ్యక్తుల ముఖాలు, గొంతులు, చిత్రాలు, రూపాన్ని గుర్తించగలిగే లక్షణాలను వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా తప్పుడు ఉద్దేశాలతో వినియోగించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. వ్యక్తులు, కళాకారుల గుర్తింపు, గొంతు, ప్రదర్శనలను డిజిటల్ రూపంలో సృష్టించడం లేదా మార్పులు చేయడానికి ముందు వారికి ముందస్తు సమాచారం ఇవ్వడం, వారి సమ్మతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని చిరు సూచించారు.
Also Read
- Ramayana Part 2: రణ్‌బీర్, యష్ కాదు.. పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణ ఆయనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజింక్య!
- O.M Movie Review: ఓం మూవీ రివ్యూ
- Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
- Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
దురుద్దేశంతో డీప్‌ఫేక్‌లను సృష్టించడం, ప్రచారం చేయడం, ఇతరుల్లా నటించడం, కంటెంట్‌ను దుర్వినియోగం చేయడం వంటి చర్యలను అడ్డుకునేందుకు సమర్థవంతమైన సివిల్, క్రిమినల్ చట్టాలను అమలు చేయాలని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. నేరాల తీవ్రతను బట్టి తగిన శిక్షలు, చర్యలు ఉండాలని కోరారు. అలాగే ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్‌పై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇతరుల్లా నటించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. మేధోసంపత్తి హక్కులను కాపాడటంతో పాటు సినీ, టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణులు, ఇతర సృజనాత్మక రంగాల నిపుణుల ప్రదర్శనలు, ఆర్థికపరమైన హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. డీప్‌ఫేక్ దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమతి లేని, హానికరమైన కంటెంట్‌ను సృష్టించేందుకు ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసే వారితో పాటు అలాంటి కార్యకలాపాలకు పరోక్షంగా సహకరించే వారిపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించాలని లేఖలో పేర్కొన్నారు.
ఏఐ దుర్వినియోగానికి అవకాశం కల్పించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సర్వీస్ ప్రొవైడర్లు, ఏఐ టూల్స్ నిర్వాహకులపైనా జరిమానాలు, శిక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని చిరంజీవి సూచించారు. సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించే క్రమంలో ఫిల్మ్ ఛాంబర్లు, టెలివిజన్ సంస్థలు, నటీనటుల సంఘాలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని కోరారు. సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నియంత్రణ విధానాన్ని రూపొందించాలని తెలిపారు. ఆయా దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని చిరు సూచించారు. సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా వ్యక్తుల హక్కులు, వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం చట్టం తీసుకురానుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!