Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?

Chiranjeevi Tharun Moorthy

Chiranjeevi Tharun Moorthy

Megastar Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండగా, తాజాగా మరో సంచలన కాంబినేషన్ తెరపైకి వచ్చి సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మలయాళంలో బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచిన ‘తుడరుమ్’ చిత్ర దర్శకుడు తరుణ్ మూర్తి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక పవర్‌ఫుల్ కథను వినిపించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ వినిపించిన నేరేషన్, అందులోని బలమైన కంటెంట్ చిరంజీవిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. న్యాచురల్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మలయాళ ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ డైరెక్టర్ కథకి మెగాస్టార్ బాగా కనెక్ట్ అయ్యారని సమాచారం. ప్రాథమికంగా కథా చర్చలు ముగిసినప్పటికీ, పూర్తి స్థాయి స్క్రిప్ట్ పూర్తయ్యాక దీనిపై మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యభరితమైన కంటెంట్ ఉన్న కథలకే చిరు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇతర భాషల్లోని ప్రతిభావంతులైన యువ దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేయడంలో, వారికి అవకాశాలు కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే ‘తుడరుమ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా నిరూపించుకున్న సదరు దర్శకుడు, చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా మాస్ అంశాలతో పాటు కథా బలం ఉన్న ఒక సరికొత్త సబ్జెక్ట్‌ను డిజైన్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. కథ లైన్ బాగా నచ్చడంతో మెగాస్టార్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతే నిర్మాత ఎవరు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఒక స్పష్టత రానుంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే, తెలుగు తెరపై కంటెంట్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన మరో అదిరిపోయే ప్రయోగం చూడొచ్చని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.