Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చూసి మనస్ఫూర్తిగా స్పందించారంటే, ఆ కథలో ఏదో బలమైన ఎమోషన్ ఉందనే అర్థం. తాజాగా దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, సినిమాపై తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రం తన హృదయాన్ని ఎంతో కదిలించిందని చెబుతూ, ముఖ్యంగా సెకండాఫ్ చూస్తున్నంతసేపూ తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తల్లిదండ్రులందరూ తప్పకుండా తమ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలని, ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మెగాస్టార్ ఆకాంక్షించారు.
ఇంతటి స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేనిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. తెరపై దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ సహజమైన యాక్టింగ్తో పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. వీరితో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన శ్రుతి హాసన్, రుహానీ శర్మ సహా మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని మెగాస్టార్ కితాబిచ్చారు.
Also Read
సాంకేతిక విభాగాల పనితీరుపైనా చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, సుజిత్ సారంగ్ అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయని ప్రశంసించారు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాణ సంస్థలు స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియాతో పాటు చిత్ర బృందం మొత్తానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మెగాస్టార్ నుంచి ఇంతటి ఆత్మీయమైన ప్రశంస దక్కడంతో ‘ఆకాశంలో ఒక తార’ టీమ్ ఆనందంలో మునిగిపోయింది.
తాజావార్తలు
-
Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
-
Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
-
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
-
Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!