Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా సామ్రాజ్యంలో రికార్డుల వేట సరికొత్త చరిత్రను లిఖించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్ల మార్కును దాటి రికార్డుల దుమ్ము దులిపేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి వెనుక ఒకరుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ గ్లోబల్ వైడ్‌గా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టారు. ఈ రేరెస్ట్ అచీవ్మెంట్తో మెగా అభిమానులు ప్రస్తుతం కాలర్ ఎగరేస్తూ పండగ చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాక్సాఫీస్‌కు తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి ఊపిరి ఊదారు. ఈ సినిమా థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌గా నిలవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపిస్తూ చిరు క్రియేట్ చేసిన ఈ రేంజ్ కలెక్షన్స్ మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి ట్రేడ్ వర్గాలకు చూపెట్టాయి.
Also Read
ఒకవైపు తండ్రి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకుమించిన స్పీడుతో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రూలింగ్ చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా నమ్మసక్యం కాని రీతిలో ₹393 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ కలెక్షన్ల వేటగా నిలిచింది.
తెలుగు సినిమా చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ విడివిడిగా ₹300 కోట్ల క్లబ్లో చేరడం ఇదే తొలిసారి. ఇటు చిరంజీవి, అటు రామ్ చరణ్ ఇద్దరూ ఒకేసారి తమ సినిమాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో ఈ సరికొత్త అధ్యాయంపై రికార్డుల పోస్టర్లు షేర్ చేస్తూ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో హడావుడి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!