కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోగా… ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ వంటి కొరతల వల్ల ఎంతోమంది అవస్థలు పడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి కరోనా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్మాణం వంటి మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా అలాగే తెలంగాణాలోని మరికొన్ని జిల్లాలకు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు పంపారు. తాజాగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు… అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ మిషన్‌లో భాగమైన అందరికి, ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
The services of #ChiranjeeviOxygenBanks will commence from today in Srikakulam,Vijayanagaram,Visakhapatnam, Mahabubnagar & Kurnool. My heartfelt gratitude to each & everyone who is a part of this mission & working relentlessly to save lives.#Covid19IndiaHelp pic.twitter.com/TWH4tM2XFc
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 29, 2021