పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని రివర్ వాలీ రోడ్‌లో రోడ్ షాప్ హౌస్ అనే మూడు అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్‌కి గాయాలయ్యాయి. రెండవ అంతస్తులోని టమాటో అనే స్కూల్‌లో ఈస్టర్ క్యాంప్‌లో ఉన్నాడు శంకర్. కొద్ది రోజుల కుకింగ్ కోర్సు కోసం శంకర్‌ను అక్కడ పవన్ సతీమణి చేర్చారు. అదే ఫ్లోర్‌లో చెలరేగిన మంటల కారణంగా శంకర్‌తో పాటు 15 మంది పిల్లలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ వారిని కాపాడింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో గాయాలతో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు మార్క్ శంకర్ పవనోవిచ్.
Akhil Akkineni: లెనిన్ టైటిల్ గ్లింప్స్ రివ్యూ
ఇక మార్క్ శంకర్‌ను చూసేందుకు చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ప్రత్యేక విమానంలో చిరంజీవి దంపతులు అక్కడికి వెళ్ళబోతున్నారు. పవన్ కుటుంబానికి అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్పేందుకు వీరు అక్కడికి వెళుతున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క విశాఖ మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్, ఆ పర్యటన ముగిసిన వెంటనే సింగపూర్ బయలుదేరి వెళ్ళనున్నారు. పవన్ వెళ్ళేలోపే చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్ళే అవకాశం ఉంది.