అనిల్ రావిపూడి చివరిగా చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి, ఫ్యామిలీ సినిమా సత్తా ఏంటో చాటింది ఈ సినిమా. నామ్ థియేటర్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ భారీగానే దక్కించుకొని, గట్టిగానే లాభపడింది. ఇక ఇప్పుడు చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా విషయంలో కూడా హక్కులు జీ స్టూడియోస్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు “మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు” అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి ఫిక్స్ చేశాడు. జీ స్టూడియోస్ సంస్థ డిజిటల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ను కూడా ఫ్యాన్సీ ప్రైస్‌కి దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దాదాపుగా డీల్ క్లోజ్ అయినట్లేనని, చిరంజీవి-అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక డబ్బులు రాబట్టిన ఓటీటీ డీల్‌గా ఇది నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read :Mirai : మిరాయ్ పోస్ట్ పోన్.. ఇన్ సైడ్ స్టోరీ
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన హిందీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కు అమ్మేసింది. అయితే, సౌత్ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను మాత్రం తన దగ్గరే ఉంచుకుంది. నిజానికి, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు ఈ సినిమా రైట్స్ దక్కించుకునే ప్రయత్నం చేశాయి. అయితే, అనిల్ రావిపూడితో ప్రస్తుతం షోస్ కూడా చేస్తున్న జీ స్టూడియోస్ సంస్థ ఫైనల్‌గా డీల్ క్రాక్ చేసింది. ఇప్పటికే ఇండస్ట్రీ సమ్మె పూర్తికావడంతో, సెప్టెంబర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి బరిలోకి దించబోతున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.