Site icon NTV Telugu

Meesala Pilla: ప్రోమోకే ఇలా అయిపోతే ఎలా.. అసలు మ్యాటర్ అబీ బాకీ హై!

Meesala Pilla Chiranjeevi

Meesala Pilla Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ పూర్తికాగా, మరికొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మధ్య ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి కాస్త మిక్స్‌డ్ రియాక్షన్ వచ్చింది. వాస్తవానికి ఈ ప్రోమోలోని సాంగ్ వినడానికి స్లో పాయిజన్‌లా ఉంది, నెమ్మదిగా ఎక్కేసేలానే ఉంది. ఇదే విషయాన్ని ఎన్టీవీ ప్రస్తావించింది కూడా.

Also Read :Kantara: మూలాలు మరచిన రష్మిక.. వేనోళ్ళ పొగుడుతుంటే స్పందించడానికి నొప్పా?

అయితే, కొంతమంది మాత్రం కావాలని టార్గెట్ చేసినట్లు ఒకటే విధంగా ప్రోమో విజువల్స్ గురించి కామెంట్లు చేశారు. ‘సీరియల్ వైబ్స్ వస్తున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ సాంగ్‌కి సంబంధించిన ఫుల్ వీడియో రిలీజ్ కాలేదు, కానీ ఒక ప్రోమో మాత్రమే ఇంత డిస్కషన్‌కి సెంటర్ పాయింట్ అయింది. వాస్తవానికి ఆ లిరిక్స్‌తో పాటు ఉదిత్ నారాయణ్ వోకల్స్ కూడా సాంగ్‌కి మంచి బూస్ట్ తీసుకొచ్చేలా ఉన్నాయి. రిలీజ్ అయిన ప్రోమో కూడా ప్రేక్షకులలోకి బాగా చర్చకు వెళ్లింది. ఆ ప్రోమోలో ఉన్న సాంగ్ బిట్స్‌తోనే ఇప్పటికే రీల్స్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశారు.

Also Read :MeToo: మత్తు మందిచ్చి రేప్ చేశాడు.. హీరోపై హీరోయిన్ కేసు.. అరెస్ట్!

మొత్తం మీద ఒక ప్రోమోతోనే అనిల్ రావిపూడి మార్క్ మరోసారి చూపించినట్లు అయింది. గతంలో ఆయన చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి ‘గోదారి గట్టు మీద’ సాంగ్ బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇలాంటి ‘మీసాల పిల్ల’ లాంటి సాంగ్స్ గట్టిగా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం హిట్ స్ట్రీక్‌లో ఉన్న భీమ్స్ అందిస్తున్న సంగీతం మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

Exit mobile version