Chennai Love Story: ఎంఎం కీరవాణి చేతుల మీదుగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి ‘వదలనే..’ పాట విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎస్ కేఎన్ (SKN) – సాయి రాజేశ్ (Sai Rajesh) ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తుండగా.. రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ (Manisharma) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ ‘వదలనే..’ లిరికల్ పాటను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ గ్రాండ్ ఈవెంట్లో ఆస్కార్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు.
ఈ మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్లో టాలీవుడ్‌కు చెందిన టాప్ 12 మంది మ్యూజిక్ డైరెక్టర్లు (అనూప్ రూబెన్స్, వివేక్ సాగర్, కల్యాణి మాలిక్ తదితరులు) అతిథులుగా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా.. ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల కాలంలో మణిశర్మ గారి నుండి ప్యూర్ మెలొడీ సాంగ్స్ మిస్ అవుతున్నాం. అందుకే ఈ సినిమాలో అన్ని పాటలు మెలొడీస్ కావాలని రిక్వెస్ట్ చేసి మరీ 7 అద్భుతమైన సాంగ్స్ చేయించుకున్నాం. ‘వదలనే..’ పాట సినిమాలో ఇంటర్వెల్ ముందు, తర్వాత కథతో పాటు ట్రావెల్ అవుతుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం, రవి నంబూరి విజన్ ఈ పాటను చిరకాలం గుర్తుండిపోయేలా చేశాయి. కిరణ్ అబ్బవరం ఈ పాటలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు’ అని తెలిపారు.
Also Read
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘ఈ పాట పిక్చరైజేషన్‌ను పాండిచ్చేరిలోని ఒక బ్యూటిఫుల్ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో చేశాం. డైరెక్టర్ రవి మాకు సీన్ చెప్తున్నప్పుడే నాకూ, గౌరి ప్రియకు కళ్లు చెమర్చాయి. ఈ పాటలోని మొదటి సీన్ తెలుగు సినిమాలో ఒక ఐకానిక్ సీన్‌గా మిగిలిపోతుంది. సినిమా చూసి బయటకు వచ్చాక కూడా ఈ పాట ప్రేక్షకులను హాంట్ చేస్తూనే ఉంటుంది’ అని తెలిపాడు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పుడు ఏ సింగింగ్ కాంపిటీషన్‌కు వెళ్లినా మణిశర్మ గారి పాటలే పాడేదాన్ని. అలాంటి లెజెండ్ సంగీతం అందిస్తున్న సినిమాలో నేను హీరోయిన్గా నటించడం నా అదృష్టం. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!