NTV Telugu Site icon

Chhaava : ఛావా 11 రోజుల కలెక్షన్స్.. పుష్ప -2 రికార్డ్ జస్ట్ మిస్

Chhaava

Chhaava

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే.. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో.. రష్మిక హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి.

Also Read : NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని ఊహించిన దానికి మించి

డే 1 నుండి భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తున్నా చావా కొద్దిలో సెన్సేషన్ రికార్డు మిస్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా
రూ. 350 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ చిత్రం నిన్న రెండో సోమవారం వర్కింగ్ డే అంతే స్ట్రాంగ్ హోల్డ్ చేసింది. అయితే ఈ సినిమా నిన్న సోమవారం 19.10 కోట్లకి నెట్ వసూళ్లు రాబట్టి త్రుటిలో పుష్ప రికార్డును అందుకోలేక వెనుకబడింది. పుష్ప 2 వరుసగా 12 రోజులు రూ. 20 కోట్లు కలెక్ట్ చేయగా, చావా 10 రోజులతో సరిపెట్టుకుంది. 11 రోజులకు గాను చావా వరల్డ్ వైడ్ గా రూ. 353 .61 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నెక్స్ట్  టార్గెట్ గా రూ. 400 కోట్ల మార్క్ ని అందుకునేందుకు చావా పరుగులు పెడుతుంది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేసి ఉంటె మరింత కలెక్షన్ వచ్చేదని ట్రేడ్ భావించింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ భారీ చిత్రాన్నిమాడాక్ నిర్మాణ సంస్థ నిర్మించింది.