శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసిన ‘చాల్ బాజ్’ చిత్రాన్ని ఎవరూ, ఎప్పటికీ మర్చిపోలేరు. ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో అది కూడా ఒకటి. తాజాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ‘చాల్ బాజ్ ఇన్ లండన్’ మూవీని భూషణ్ కుమార్, కిషన్ కుమార్, అహ్మద్ ఖాన్, సైరాఖాన్ నిర్మిస్తున్నారు. 1989లో వచ్చిన సూపర్ కామెడీ మూవీ ‘చాల్ బాజ్’కు దర్శకత్వం వహించిన పంకజ్ పరాశర్ ‘చాల్ బాజ్ ఇన్ లండన్’కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి శ్రద్ధాకపూర్ డ్యుయల్ రోల్ చేయబోతోంది. దాంతో సహజంగానే ఇది ‘చాల్ బాజ్’కు రీమేక్ అనే ప్రచారం మొదలైంది. కానీ ఆ వార్తలను దర్శక నిర్మాతలు ఖండించారు. ఇది శ్రీదేవి నటించిన ‘చాల్ బాజ్’కు రీమేక్ కాదని స్పష్టం చేశారు. అంతేకాదు… గతంలో ‘చాల్ బాజ్’ను మన్మోహన్ శెట్టి రీమేక్ చేయాలనుకున్నప్పుడు కూడా తనను సంప్రదించలేదని, పంకజ్ పరాశర్ తెలిపాడు.
Read Also : ‘అర్జున్ రెడ్డి’ని వద్దని బాధ పడుతున్న పార్వతి
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. శ్రీదేవి నటించిన ‘చాల్ బాజ్’ను రీమేక్ చేయాలని భావించిన మన్మోహన్ శెట్టి, ఆ సినిమా రైట్స్ ను జయంతి లాల్ గడ నుండి పొందారు. ఆరు నెలల్లో సినిమా ప్రారంభించాలని, లేదంటే తిరిగి హక్కులు తనకే చెందుతాయని జయంతి లాల్ ఎగ్రిమెంట్ చేసుకున్నారట. దాంతో మన్మోహన్ శెట్టి… అలియాభట్ తో ‘చాల్ బాజ్’ను రీమేక్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. దాంతో ఇప్పుడు తిరిగి ఆ సినిమా హక్కులను జయంతి లాలే సొంతం చేసుకున్నారు. అయితే.. ‘చాల్ బాజ్’ రీమేక్ అంశాన్ని తన కుమార్తె పూజా చూసుకుంటోందని జయంతిలాల్ చెబుతున్నారు. మరి ‘చాల్ బాజ్ ఇన్ లండన్’కు పోటీగా… జయంతి లాల్ ‘చాల్ బాజ్’ను అలియాభట్ తో కాకపోయినా… మరో స్టార్ హీరోయిన్ తో తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.