Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి వరకు సినిమాల వసూళ్లపై ఇండస్ట్రీలో ఒక రకమైన చర్చ జరుగుతుండగా, బన్నీ వాస్ చేసిన విశ్లేషణ అందరినీ ఆలోచింపజేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ప్రతి ఒక్కరికీ రూపాయి ఆదాయం పోయింది. పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది’ అంటూ బన్నీ వాస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తావించారు. అంటే గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగడం, లాభాల శాతం తగ్గడం వంటి అంశాలను ఆయన ఎత్తి చూపారు.
ప్రస్తుతం సినిమాలు రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూలు చేస్తున్నాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కావు. టికెట్ రేట్లు పెరగడం, ఇతర ధరల పెరుగుదల వల్లే ఆ భారీ నంబర్లు కనిపిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు. అంటే సినిమాకు వచ్చే జనం కంటే, వచ్చిన వారి నుంచి వసూలు చేసే ధరలే ఈ రికార్డులకు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే కేవలం రేట్లు పెంచడం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా మార్పులు రావాలని ఆయన ఈ ట్వీట్ ద్వారా సూచించారు. అంతే కాదు..
Also Read
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
‘సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది.. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం.. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు..ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు. మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?’ అంటూ సూటిగా మాట్లాడారు. ప్రజంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని…
— Bunny Vas (@TheBunnyVas) May 13, 2026
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..