Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!

Buchi Babu Sana , Peddi Ramcharan

Buchi Babu Sana , Peddi Ramcharan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ వేసవిలో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చే అసలైన మాస్ బొమ్మ ఇదేనని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్టీఆర్ ‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి జాన్వీ రాకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ ట్విస్ట్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సన తాజాగా రివీల్ చేశారు.

సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సన మాట్లాడుతూ.. మొదట ఈ పాత్ర కోసం జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ (Kushi Kapoor) ను అనుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ‘మేము మొదట ఈ కథలోని హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఖుషీ కపూర్‌ను ఫస్ట్ ఛాయిస్‌గా అనుకున్నాము. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని చర్చలు, పాత్ర డిమాండ్ ఆధారంగా అదే ఇంటి నుండి ఖుషీ కాకుండా ఆమె అక్క జాన్వీ కపూర్ అయితేనే ఈ రస్టిక్ రోల్‌కు వంద శాతం న్యాయం చేయగలదని భావించి.. ఫైనల్‌గా జాన్వీని లాక్ చేశాము’ అంటూ బుచ్చిబాబు అసలు సిసలైన లీక్ ఇచ్చారు. ఒకవేళ జాన్వీ కపూర్ కాకుండా ఖుషీ కపూర్ గనుక రామ్ చరణ్ పక్కన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే.. టాలీవుడ్‌లో ఆమెకు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ డెబ్యూ (భారీ పరిచయం) అయ్యి ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.