Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన చిన్న సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో ఎలివేషన్లకు, ఊర మాస్ ఫైట్లకు, హారర్ కామెడీలతో విసుగుపోయిన బాలీవుడ్ జనాలకు హార్ట్ టచ్చింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఫిల్మ్ సైయారా. పెద్ద హైప్ అండ్ హోప్ లేకుండా జులై 18న థియేటర్లలోకి వచ్చి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యేలా కాసుల సునామి సృష్టిస్తోంది. సినిమా వచ్చి ఇరవై రోజులైనా గల్లాపెట్టి నింపుతూ నిర్మాతలకు ఊహించనంత పర్సెంటైజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైమ్ మొమొరబుల్ మూవీగా సైయారా మారింది అనడంలో నో డౌట్.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సైయారా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిన ఈ ఫిల్మ్ ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. 2025 రిలీజైన హిందీ చిత్రాల్లో ఛావా తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సెకండ్ ఫిల్మ్‌గా మారింది. అంతే కాదు హృతిక్, షారూఖ్ హిట్ చిత్రాల కలెక్షన్లను క్రాస్ చేసింది. 2023లో షారూక్ అండ్ రాజ్ కుమార్ హీరాని కాంబోలో వచ్చిన డంకీ కలెక్షన్లను ఓవర్ టేక్ చేసింది ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. డంకీ మాత్రమే కాదు హృతిక్ రోషన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ సాధించిన వార్ ఓవరాల్ కలెక్షన్లు రూ. 475 కోట్లు కాగా, ఇప్పుడు ఈ నంబర్‌ను క్రాస్ చేసి ధూమ్3, టైగర్ జిందా హై, పద్మావత్ గ్రాస్ వసూళ్లను టార్గెట్ చేస్తోంది. అయితే నెక్ట్స్ వీక్ వరకు అంటే వార్ 2 వచ్చేంత వరకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే రూ. 750 మార్క్ చేరువ కావడం పెద్ద కష్టం కాదంటున్నారు.
Also Read
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
- Janhvi Kapoor: 'పెద్ది' అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
- Prabhas : 'స్పిరిట్' పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
- OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!