అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా అనే పాట దేశాన్ని ఊపేసింది. మరోసారి అయాన్ తన టీంను ‘వార్ 2’ కోసం రంగంలోకి దించారు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది.
Also Read : Sandalwood : పాన్ ఇండియా మోజులో కన్నడ హీరోలు.. రిలీజ్ కు రెండు భారీ సినిమాలు
ఇక తాజాగా ఈ మూవీలోని ఓ డ్యూయెట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. హృతిక్, కియారా మీద చిత్రీకరించే ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ సినిమా బ్రహ్మాస్త్ర లోని కేసరియా సంగీత బృందాన్ని రంగంలోకి దించారు అయాన్ ముఖర్జీ . ‘వార్ 2’లోని ఈ యుగళ గీతం కోసం ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య మళ్ళీ ఒకే చోటకు చేరారు. త్వరలోనే ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘వార్ 2’లో హృతిక్, కియారా పాత్ర మధ్య ప్రేమను చూపించే అందమైన ట్రాక్‌గా ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఇక ఇదే ‘వార్ 2’ నుంచి వచ్చే మొదటి పాట.హై అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన థియేట్రికల్ యాక్షన్ ప్యాక్డ్ ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా హక్కులను టాలీవుడ్ బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.