నటుడు బాబీ సింహా హీరోగా, నటి హెబ్బా పటేల్ హీరోయిన్‌గా యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం భారీ స్థాయిలో ప్రారంభమైంది. యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ యరమతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా మొదలైంది. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్‌కేఎన్ క్లాప్ కొట్టగా, వంశీ నందిపాటి కెమరా స్విచ్చాన్ చేశారు. నటుడు తనికెళ్ల భరణి మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి మరియు సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి. కృష్ణ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా, సిద్ధార్థ సదాశివుని సంగీత దర్శకుడిగా, వివేక్ అన్నామలై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు.
Also Read :SP Balu: వివాదాల నడుమ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..చివరి కోరిక నెరవేరింది!
హీరో బాబీ సింహా మాట్లాడుతూ “వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉంది. తెలుగులో హీరోగా చేయాలనుకున్నప్పుడు మంచి కథ కోసం ఎదురుచూస్తున్న నాకు, యువ నుంచి కాల్ వచ్చింది. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా నచ్చింది. ఇది ఒక యాక్టర్‌ని ఛాలెంజ్ చేసే కథ. నా కెరీర్‌లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో తాత పాత్రను భరణి గారు పోషిస్తున్నారని తెలిసి చాలా ఆనందం వేసింది. హెబ్బా ఎక్సలెంట్ పెర్ఫార్మర్. డిసెంబర్ 22 నుంచి వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించనున్నాం.” అన్నారు.