సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన పాపులర్ నటుడు సోహెల్. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సోహెల్ మంచి గేమ్ ఆడి తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ప్రశంస లను పొందిన సోహెల్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల ద్వారా మరింత అభిమానాన్ని పొందుతున్నాడు. సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న వారికి రేషన్, భోజన సదుపాయాలు సమకూరుస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రజలతో సోహెల్ పంచుకున్నాడు. తన ఇన్స్టా లో ఓ వీడియో ద్వారా ఈ సంస్థ పనితీరు వెల్లడించాడు. దీన్ని వెనుక ఉండి నడిపించిన వారిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ.. “సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్ లో కూడా ఇలానే చేస్తాం. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి. కొన్ని రోజుల్లో వందమంది జూనియర్ ఆర్టిస్ట్ లకు రేషన్, సరుకులు అందించబోతున్నాం. మా చారిటీ సంస్థ ద్వారా నాలుగు ఆపరేషన్స్ ని విజయవంతంగా పూర్తి చేశాం. వాటిలో ఒకటి న్యూరో సర్జరీ కాగా మరో మూడు హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందు నుంచి సపోర్ట్ గా ఉన్న సోహిలియన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని, అందరికీ అందుబాటు లో ఉండేలా సహాయపడతాము” అని అన్నారు.
Also Read
- Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
- Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
- Lenin: 'లెనిన్' టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!
- AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
తాజావార్తలు
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గురిందర్‌వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?