Theppa Samudram: బిగ్ బాస్ అర్జున్ హీరోగా తెప్ప సముద్రం.. 19న రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Also Read: Diwali Movies : దీపావళి బరిలో ఐదు క్రేజీ సినిమాలు.. ఆ రెండు స్పెషల్..
Also Read
హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. చిన్న సినిమా అనగానే కాస్ట్ అండ్ క్రూ వచ్చామా.. పని చేశామా.. డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లు ఉంటారు. కానీ డైరెక్టర్, నిర్మాతకు తడిసి మోపెడవుతుంది. సినిమా రిలీజ్ వరకూ వాళ్లు చాలా వేదన పడుతుంటారు. మా నాన్న, పెద్దనాన్ని డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఆ వేదన నాకు తెలుసు. ఇలాంటి డైరెక్టర్, నిర్మాతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. వీళ్లకు తెలిసింది సినిమా ఒక్కటే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా. ఈ సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 19న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!